Son Killed Mother in gadwala district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, సీఐ శివశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రాముడు, నాగమ్మ(65) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. తల్లి గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా మూడేళ్ల నుంచి పనిచేస్తోంది. తండ్రి వ్యవసాయ కూలీ. ఈ దంపతుల ఏడుగురు సంతానంలో ప్రేమరాజ్ ఆరో సంతానం. ఇతను 9 సంవత్సరాల కిందట ప్రసన్న అనే అమ్మాయిని వివాహం చేసుకుని హైదరబాద్‌లో పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రేమ్‌రాజ్ మానసికంగా ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతనిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దాదాపుగా 15 రోజుల కింద తల్లిదండ్రుల వద్దకు వచ్చి రామాపురంలో ఉంటున్నారు. శుక్రవారం నాగమ్మను రూ.10,00 ఇవ్వాలని ప్రేమ్‌రాజ్ అడిగాడు. ఈ క్రమంలోనే ఆమె తన వద్ద డబ్బ లేదని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరువరి మధ్య ఘర్షణ నెలకొంది.
ప్రేమ్‌రాజ్ ప్రేమ్‌రాజ్ గొడ్డలితో నాగమ్మపై విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతురాలి భర్త రాములు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. శవపరీక్ష నిమిత్తం నాగమ్మ మృతదేహాన్ని అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
తల్లిని కొడుకు డబ్బులు అడగడంతో.. ఆ డబ్బుల విషయంలో వారికి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిపై కుమారుడు గొడ్డలితో వెళ్తే.. తండ్రి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపైన దాడికి యత్నించాడు. డబ్బులు ఇవ్వట్లేదని అక్కడే ఉన్న తల్లిని గొడ్డలితో చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. -శ్రీనివాస్, ఎస్సై శాంతినగర్
ఇవీ చదవండి:
- క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. అక్కడికక్కడే యువకుడి మృతి
- ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
- ప్రేమ వివాహం ఎంత పని చేసింది.. విడదీశారని యువకుడి ఆత్మహత్య
- క్షణికావేశంలో భర్త ఆత్మహత్యాయత్నం.. మనస్తాపంతో తల్లీకుమార్తె బలవన్మరణం
- హనుమాన్ జయంతి స్పెషల్.. 16 కోట్ల సార్లు 'రామ' నామ జపం.. ప్రతి ఒక్కరూ లక్షకుపైగా!
- అమ్మమ్మ ఇంట్లో నెల రోజుల కొడుకు.. చూసేందుకు వెళ్తుండగా ఘోరం.. అక్కడికక్కడే తండ్రి మృతి
- 'ఏప్రిల్ 10, 11న మాక్‌డ్రిల్స్.. కొవిడ్ టెస్ట్‌లు పెంచాల్సిందే'.. రాష్టాలకు కేంద్రం ఆదేశాలు!