జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగుచేసే రైతుల విషయంలో కంపెనీలు, ఆర్గనైజర్లు అనుసరిస్తున్న దోపిడికి వ్యతిరేకంగా కొద్ది నెలలుగా రైతులు నిరసన తెలుపుతున్నారు. స్పందించిన కలెక్టర్ శశాంక, ఎస్పీ అపూర్వరావు.. కంపెనీలు, అర్గనైజర్లు, రైతు ప్రతినిధులతో జరిపిన సమావేశం విఫలం కావడం వల్ల కర్షకులు మరోసారి ఆందోళనకు దిగారు. గద్వాల-ఎర్రవెల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని ఠాణాకు తరలించారు.
వడ్డీ వసూలు
సాధారణంగా విత్తనపత్తి సాగు చేసే రైతు.. ఆ పంట సాగుకు అవసమైన పెట్టుబడిని ఆర్గనైజర్ల నుంచి తీసుకుంటారు. ఇచ్చిన పెట్టుబడికి కంపెనీలు అన్నదాతల వద్ద వడ్డీ కూడా వసూలు చేస్తారు. పంట చేతికి రాగానే, రైతు.. కంపెనీకి పత్తి అప్పగించాలి. అప్పగించిన పంటకు ఆదాయం ఎంత వస్తుందో.. అప్పు, వడ్డీ ఎంతో ఉందో లెక్కించి మిగిలిన డబ్బు రైతులకు చెల్లించాలి. కానీ ఆర్గనైజర్లకు డిసెంబర్, జనవరిలో పంట అప్పగిస్తే.. జులై వరకూ డబ్బులు చెల్లించడం లేదు. పైగా జులై వరకూ వడ్డీ వసూలు చేస్తున్నారు.
410 రూపాయలు మాత్రమే
పత్తి నుంచి గింజ వేరు చేసే సమయంలో పత్తి తూకాన్ని తగ్గించి చూపుతున్నారు. ప్యాకెట్లకు కంపెనీ రూ. 490 చెల్లిస్తే ఆర్గనైజర్లు రూ. 410 మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. ఈ రేటును పెంచాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ల సాధన కోసం గత 3 నెలలుగా వివిధ రూపాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
విత్తనపత్తి సమస్యల పరిష్కారం కోసం కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు, రైతు సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శశాంక, ఎస్పీ అపూర్వరావు సమావేశం నిర్వహించారు. కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని, ఒప్పందపత్రంలోనే పెట్టుబడి, ప్యాకెట్ ధర సహా ఇతర అంశాలు పొందుపరచాలని స్పష్టం చేశారు. విత్తనపత్తి ప్యాకెట్ ధరను రెండు వారాల్లోపు పెంచాలని ఆదేశించారు. విత్తనపత్తి సాగులో బాలకార్మికులను వాడబోమని ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. అధికారులతో సమావేశం తర్వాతైనా కంపెనీలు, అర్గనైజర్ల తీరులో ధర పెంచుతారో లేదో చూడాలి మరి.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు
Body:babanna
Conclusion:gadwal