జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న వీకేర్ గోడౌన్లో ఇసుక నిల్వలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది. వీరు మైనింగ్ అధికారులకు తెలియజేయగా మైనింగ్ అధికారి జయరాం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రూ. 10 లక్షల విలువైన ఇసుకను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
టీఎస్ఐఎండీసీ ద్వారా తుమ్మిళ్ల నుంచి లారీల ద్వారా ఇసుక వెళ్తోంది. వే బ్రిడ్జిపై బరువు చూసుకుని ఎక్కువ పరిమాణం ఉన్న ఇసుకను పక్కనే అన్లోడ్ చేసి పక్కనే ఉన్న గోడౌన్ లోపల అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు గుర్తించామని జయరాం తెలిపారు. సీజ్ చేసిన ఇసుకకు రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'