కృష్ణమ్మ వరద ఉద్ధృతికి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల సమీపంలో జరుగుతున్న సెంట్రల్ పవర్ గ్రిడ్ పనులు నిలిచిపోయాయి. కొన్న రోజులుగా ఛత్తీస్గఢ్ నుంచి కేరళ వరకు పవర్ గ్రిడ్ సంస్థ పనులు నిర్వహిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రోజురోజుకు నీటి ప్రవాహం పెరుగుతోంది. నది సమీపంలో నిర్మిస్తున్న పవర్ గ్రిడ్ సంస్థ సామగ్రి మొత్తం నీటిలో మునిగి పోవటం వల్ల సిబ్బంది పనులు నిలిపి వేశారు. మునిగిన సామాగ్రిని ఒడ్డుకు తరలించేపనిలో నిమగ్నమయ్యారు. గొందిమల్ల సమీపంలో గతంలో పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన ఘాట్ సైతం మునిగిపోయింది.
ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు..