ETV Bharat / state

Pedda Vagu Bridge Works in Gadwal : శరవేగంగా సాగుతున్న వంతెన పనులు.. అయినా ప్రజలకు తప్పని ఇక్కట్లు.. ఇదే కారణం..! - ఐజలో పెద్దవాగుపై వంతెన

Pedda Vagu Bridge Works at Ieeja in Gadwal : జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని ఐజ పురపాలికలో పెద్దవాగుపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నందున.. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం అవ్వడంతో ప్రత్యామ్నాయంగా నిర్మించిన మట్టి రోడ్డు గుంతలు పడింది. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎక్కువైపోయాయి.

Pedda Vagu Bridge Works in Jogulamba Gadwal
Pedda Vagu Bridge in Ieeja
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 10:11 PM IST

Pedda Vagu Bridge Works at Ieeja in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా పురపాలికలో ఐజా నుంచి గద్వాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పెద్దవాగు(pedda Vaagu Bridge)పై ఉన్న పురాతన వంతెనను కూల్చివేసి రూ.7 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి మూడు నెలల కింద అధికారులు పనులు ప్రారంభించారు. వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నా.. ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కానీ వంతెన నిర్మాణం చేపట్టే సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు(R and B Employee) ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పురపాలిక ప్రజలతో పాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో చేపట్టాల్సిన వంతెన నిర్మాణాన్ని వర్షాకాలంలో నిర్మిస్తున్నందున ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. కర్నూలు, శాంతినగర్, రాయచూరు వైపు నుంచి ఐజకు చేరుకునే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వరకే వచ్చి తిరిగి వెళుతున్నాయి.

Asifabad Bridge Issue : వంతెన లేక నిత్యం వెతలే.. వాగు దాటాలంటే చాలు గుండెల్లో గుబులే!

Passengers Facing Problems in Gadwal : గద్వాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ సమీపం నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు బస్టాండ్ వద్ద దిగి వాగులో నడుచుకుంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆవల వైపు చేరుకుంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ముందస్తు ప్రణాళిక చేపట్టకపోవడంతో ఐజ పురపాలిక కమిషనర్ తాత్కాలిక రహదారి చేపట్టారు.

"బ్రిడ్జి దగ్గర నాది షాపు ఉంది. రోజు ఈ మార్గం ద్వారా వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే పనులు ప్రారంభించి మూడు నెలలు అవుతోంది. వర్షాల వల్ల మధ్య మధ్యలో పనులు ఆగిపోతున్నాయి. బస్సులు పాత బస్టాండ్‌ దగ్గర ఆగిపోతున్నాయి. ప్రజలు ఎవరైనా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బ్రిడ్జి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- వెంకటేశ్‌, స్థానికుడు

Bridge Works at Ieeja in Gadwal : అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రహదారి ద్వారా చేరుకునేందుకు అర కిలోమీటర్ పైగా అవుతుండటంతో కాలినడకన అవతలి వైపు చేరుకునే ప్రయాణికులు వాగులోనే వెళ్తు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక పెద్ద వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఐజ పురపాలిక అధికారులు తాత్కాలిక మట్టి రోడ్డును వేశారు. కానీ ఇటీవల కురిసిన వర్షాల సమయంలో ఆ దారిపై వర్షపు నీటి నిల్వతో గుంతలు ఏర్పడి వాహనదారులు సమస్యగా మారింది. మూడు నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణం చేయడం.. మరోవైపు ఆ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

"పెద్దవాగుపై రూ.7కోట్లతో వంతెన నిర్మిస్తున్నాం. ప్రజలకి, వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రత్యామ్నాయ పనులు చేపట్టాం. ఇవి ప్రజలకి ఉపయోగపడుతున్నాయి. వంతెన పనులు వేగంవంతంగా చేస్తున్నాం. అవి పూర్తి అవ్వగానే ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తాం."- గోల్కొండ నరసయ్య, ఐజ పురపాలిక కమిషనర్

Pedda Vagu Bridge వంతెన నిర్మిణ పనులు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు

Bridge Collapsed in Adilabad : వర్షాలకు కూలిన వంతెన.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు

'వర్షాకాలం వచ్చేలోగా వంతెన పూర్తి చేయండి సార్.. లేదంటే..'

Hyderabad Steel Bridge Drone visuals : ప్రజారవాణాలో మరో మైలురాయి.. హైదరాబాద్​లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టీల్​బ్రిడ్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.