జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన శిరీషకు వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన హరి ప్రసాద్ గౌడ్‌తో మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. నాలుగు నెలల పాటు సజూవుగానే సాగిన వీరి కాపురంలోకి కట్నం చిచ్చుపెట్టింది. రెండేళ్ల క్రితమే శిరీషని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయారు. గ్రామ పెద్దలు పలు మార్లు పంచాయతీ చేశారు. అయినప్పటికీ భర్తలో మార్పురాకపోవడం వల్ల... అతని ఇంటి ముందే ధర్నాకి దిగింది. ఆరు బయటే వంట చేసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. అధికారులు స్పందించి తన భర్తతోనే కలిసుండేలా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్న అత్తింటి వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో 50 మంది బాలకార్మికుల విముక్తి