జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తుపత్రాల, ధరూర్ మండలం గుడెందొడ్డి గ్రామాలలో నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. తుపత్రాల గ్రామంలో ఏకంగా బీస్ట్ కాటన్ హైబ్రిడ్ అనే నకిలీ కంపెనీ పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అనుమానం రాకుండా విత్తనాలను అమ్ముతున్నారు. బీస్ట్ కాటన్ హైబ్రిడ్ పేరుతో అమ్ముతున్న కుర్వ రాఘవేంద్ర, కూర్వ నల్లారెడ్డి ,చిన్న బస్సయ్యను అయిజ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వీరు ఇంత వరకు ఎంత మంది రైతుల కు ఈ విత్తనాలు సరఫరా చేసి ఉంటారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ధరూర్ మండలం గుడెందొడ్డి గ్రామంలో 8 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మల్దకల్ మండలం నాగర్దొడ్డి, శేషంపల్లి, ఉలిగేపల్లి తదితర గ్రామాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు 7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఇలాంటి దాడులు ఇంకా ముమ్మరం చేస్తామని, ముఖ్యంగా రైతులు నకిలీ పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: మల్లారెడ్డిపై అసత్య కథనాలు.. పోలీసులకు ఫిర్యాదు