Law Students Federation: తెలంగాణ లా స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా ముత్త శ్రీను ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుండెల క్రాంతికుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు కేసరి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సన్నీ కుమార్, కార్యదర్శి సతీష్గౌడ్తో పాటు న్యాయ విద్యార్థులు విజయ్ కుమార్, సాయి కుమార్, రవికుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కల్పిస్తాం..
తన నియామకం పట్ల రాష్ట్ర కార్యవర్గానికి ముత్త శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాగం, చట్టాలు, న్యాయం వంటి అంశాలపై అట్టడుగు వర్గాలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. న్యాయవిద్యార్థుల శ్రేయస్సుకు ముందుంటానని వెల్లడించారు.
ఇదీ చూడండి: