గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి సమీపంలో ఉన్న డ్యాంలో మత్స్యకారులతో కలిసి ఐదు లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే అబ్రహం వదిలారు. మత్స్యకారులను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు నదులు మొదలైన వాటిలో చేప పిల్లలను వదులుతున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు.


రాష్ట్రంలో వివిధ రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందాలని బలమైన ఆకాంక్షతో కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు వృద్ధి చెందాలని నదులు-చెరువుల్లో చేప పిల్లలను వదిలి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. చేపలను పట్టుకుని అమ్ముకోవడానికి మార్కెట్లను అదేవిధంగా చేపలు పట్టడానికి వలలను చేపల రవాణా కొరకు వాహనాలను ఇస్తున్నట్లు వెల్లడించారు.
- ఇవీ చూడండి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ