ఉద్యోగాలు, పీఆర్సీ విషయంలో భాజపా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గమనించాలన్నారు. మీ హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజలో నిర్వహిచింన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తామని తాము ఎక్కడ చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాలపై భాజపా అసత్య ప్రచారం చేస్తూ చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎల్లప్పడు అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థి సురభి వాణీదేవిని అధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలు