ETV Bharat / state

ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయండి - అధికారులతో జూపల్లి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 7:59 PM IST

Minister Jupally Krishna Rao Review with Govt Officials : ప్రజా ఆకాంక్షలకు అణుగుణంగా జిల్లా అధికారులందరు సమష్ఠి బాధ్యత వహించి పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు, మహిళలకు సంబంధించి ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. జూరాల, నెట్టెంపాడు, ర్యాలంపాడు, ఆర్​టీఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Minister Jupally Orders to Officials
Minister Jupally Krishna Rao Review with Govt Officials

Minister Jupally Krishna Rao Review with Govt Officials : ప్రజా అభివృద్ధిలో పారదర్శకంగా ప్రజల అకాంక్షలకు అనుగుణంగా జిల్లా అధికారులందరూ సమష్ఠి బాధ్యత వహించి పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్(District Collector) ఆవరణంలోని ఐడీఓసీ సమావేశం హాలు నందు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పారదర్శకంగా, అవినీతి లేకుండా మంచి పరిపాలన అందించాలని కోరారు.

Jupally on Palamuru Rangareddy Project : "ప్రచార ఆర్భాటం కోసం.. పాలమూరు ప్రాజెక్టును పూర్తయినట్లుగా చూపిస్తున్నారు"

రైతులకు, మహిళలకు సంబంధించి ప్రజా సంక్షేమమే పరమావధిగా అధికారులు పనిచేయాలని కోరారు. ఎక్కువగా ధరణి సమస్యలు పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశించారు. ధాన్యం సేకరణ గురించి ఆరా తీశారు. జూరాల(Jurala Project), నెట్టెంపాడు, ర్యాలంపాడు, ఆర్డీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతవరకు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించారు. టూరిజం, మున్సిపల్, ఆర్అండ్​బీ, పంచాయతీ రాజ్ అధికారులను శాఖల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Minister Jupally Review on Lift Irrigations : గద్వాల జూరాల టూరిజంలో 75 శాతం పనులు పూర్తయ్యాయని, ఇక అలంపూర్​లో జోగులాంబ ఆలయంలో ప్రసాద్ పథకం పనులు 70 శాతం పూర్తయినట్టు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ(Health Department) గురించి మంత్రి ఆరా తీయగా జిల్లాలో గద్వాల, అలంపూర్​లలోని 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అనంతరం అబ్కారీ శాఖపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ రెడ్డి, ఎమెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, విజయుడు పాల్గొన్నారు.

ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం

Jupally Krishna Rao Take Charge on Tourism and Excise Minister : తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజు ఎంత సంతోషంగా ఉందో ఇవాళ అంతకంటే రెట్టింపు సంతోషంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల సచివాలయంలోని తన ఛాంబర్‌లో పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలను జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. నీళ్లు, నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(BRS Govt) నియంత పాలన, డిక్టేటర్ పాలనగా మారి గతంలో పాలన సాగించిందని ఆరోపించారు. ఈ దఫా హస్తం పార్టీకి అవకాశం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం ప్రజలు తీర్చుకున్నారని తెలిపారు. రాబోయే కాలంలో గత పరిపాలన కంటే, కాంగ్రెస్‌ పాలన అద్భుతంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

జోగులాంబలో మంత్రి జూపల్లి సమీక్ష - ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని అధికారులకు పిలుపు

టీఎస్​పీఎస్సీపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష - పదో తరగతి, ఇంటర్​ పరీక్షలపై కూడా

తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.