దక్షిణ కాశీగా పేరొందిన జోగులాంబ గద్వాల్ జిల్లా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. గురువారం ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయని పూజారులు తెలిపారు.