జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం వేదనగర్ కాలనీకి చెందిన యువతి, హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన యుగేందర్‌గౌడ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యుగేందర్ తండ్రికి ఈ మధ్యకాలంలో వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల ఆర్థికంగా చితికిపోయాడు. ఈ కారణంతో తన ప్రేమను యువతి నిరాకరించిందని యుగేందర్ తెలిపాడు. యువతి ఇంటికెళ్లి తన ప్రేమ విషయం తెలపాలని ప్రయత్నించగా వారు ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన యుగేందర్.. యువతి ఇంటివద్దే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలైన ఆ యువకుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: ఇందూరులో మాత్రం 2 హాళ్లు, 36 టేబుళ్లు: రజత్