ETV Bharat / state

Virtual Teaching: ఆ 'సార్' పాఠం చెబుతుంటే 'కళ్లకు కట్టినట్టే' ఉంటుంది - Ravi Shankar teaching classes

Virtual Teaching: వర్చువల్ రియాలిటీ, ఆగ్యూమెంటెండ్ రియాలిటీ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. వీటిని ఎలా వినియోగించాలో తెలుసుకుని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సరిగ్గా అదే కోణంలో ఆలోచించారు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. పాఠ్యాంశాల బోధనకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు.

Ravi Shankar teaching classes innovatively using technology
సాంకేతికతను ఉపయోగించి వినూత్నంగా తరగతులు బోధిస్తున్న రవిశంకర్
author img

By

Published : Feb 20, 2023, 12:31 PM IST

Virtual Teaching: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రవిశంకర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పాఠ్యాంశాలకు శాస్త్ర సాంకేతికతను జోడించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వర్చువల్ రియాలిటీ, ఆగ్యూమెంటెడ్ రియాలిటీలతో సైన్స్ పాఠాలు బోధిస్తున్నారు. వర్చువల్ రియాలిటీలో హెడ్ సెట్​ను ఉపయోగించి జీవశాస్త్రానికి సంబంధించిన వీఆర్ వీడియోలను చూపిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గత ఏడాది నుంచి ట్యూటర్ యాప్‌ను వినియోగిస్తూ ఈ సాంకేతికతో డిజిటర్ తెర ద్వారా పాఠాలు చెబుతున్నారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు: అయితే బోధనలో కొత్తదనాన్ని చాటుకోవడం, వినూత్న పద్దతులు అనుసరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం రవిశంకర్​కు కొత్తేమీ కాదు. 2019 నుంచి ఆయన బోధనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2020లో జీవశాస్త్ర వర్ణమాలను రూపొందించారు. 2021లో జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్​ను తయారు చేశారు. ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జీవశాస్త్ర సంఖ్యా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నారు.

మెచ్చుకున్న విద్యాశాఖ మంత్రి: 2022లో పదో తరగతి జీవశాస్త్ర పాఠ్యాంశాల ఆధారంగా వైకుంఠపాళిని తయారుచేశారు. విద్యారంగంలో ఇతను చేస్తున్న సేవలను తెలుసుకుని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రవిశంకర్‌ చెబుతున్న పాఠాలు తమకు సులభంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జీర్ణ, శ్వాస, విసర్జన వ్యవస్థలను వర్చువల్ రియాలిటీ ద్వారా వివరించినప్పుడు విద్యార్థులే ఆ వ్యవస్థలోకి ప్రవేశించిన భావనతో పాఠాలు సులభంగా అర్ధం చేసుకుంటారని రవిశంకర్ తెలిపారు. ఆగ్యూమెంటెడ్ రియాలిటీతో గుండె, రక్త ప్రసరణ, తదితర వ్యవస్థలను వివరించినప్పుడు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, చెప్పిన పాఠాలను ఎక్కువ కాలం గుర్తించుకుంటారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింతగా..: ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభ బోధన పద్ధతుల్ని గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు అందిస్తానని రవిశంకర్ అంటున్నారు. ముఖ్యంగా సైన్స్ పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమవ్వాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నది ఆయన అభిప్రాయం.

సాంకేతికతను ఉపయోగించి వినూత్నంగా పాఠాలు బోధిస్తున్న రవిశంకర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.