గ్రామాల్లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించాలని పంచాయతీ సెక్రటరీలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా ఆదేశించారు. జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ పరమాల గ్రామ నర్సరీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోన్న పంచాయతీ సెక్రటరీ విఘ్నేశ్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తులు, గ్లౌసులు, మాస్కులు, శానిటైజర్లు అందించాలని ఎంపీడీఓలను కలెక్టర్ శ్రుతి ఓఝా ఆదేశించారు. ఎనిమిది రోజులు జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎనిమిది రోజుల తర్వాత గ్రామాల్లో ఎక్కడ చెత్తా చెదారం, నీటి గుంతలు కనిపించడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
- ఇవీ చూడండి: గరికపాడు చెక్పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు