జోగులాంబ గద్వాల జిల్లాలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని కలెక్టర్ శృతి ఓజా అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై జిల్లాలోని అధికారులతో ఆమె దూర దృశ్య సమీక్షను నిర్వహించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారితో ప్రతిరోజు తహసీల్దార్, మెడికల్, పోలీస్ అధికారులు సంప్రదింపులు జరపాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి పై నివేదిక తీసుకోవాలని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించాలని, శానిటేషన్ పనులను కొనసాగించాలని కోరారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసుల సంఖ్య..