రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని విద్యుత్ అధికారులు చేతివాటం(Electricity officials cheating farmers) ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో సాగు అవసరాలకు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతులు డీడీలు చెల్లిస్తారు. దీంతో వాటిని అమర్చేందుకు అయ్యే స్తంభాలు, తీగలు, దిమ్మె సహా ఇతర సామాగ్రిని ప్రభుత్వం 2లక్షల 80వేల వరకూ రాయితీపై అందిస్తుంది. రవాణా సహా ట్రాన్స్‌ఫార్మర్ అమర్చేందుకు అయ్యే ఖర్చులు సైతం సంబంధిత గుత్తేదారుకు చెల్లిస్తుంది. కానీ పలుచోట్ల రైతుల అవసరాన్ని అవకాశంగా మలచుకుంటున్న అధికారులు ట్రాన్స్‌పార్మర్ మినహా మిగిలిన ఖర్చులను రైతు పైనే(gadwal district power sector news) మోపుతున్నారు.
సొంత ఖర్చులతో అమర్చుకోవాల్సిన దుస్థితి
విద్యుత్ నియంత్రికలు తొందరగా మంజూరు చేయడంలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, గట్టు మండలాల్లో ఈ తరహా ఘటనలు(Irregularities in gadwal district power sector) వెలుగుచూశాయి. ట్రాన్స్‌ఫార్మర్ అమర్చేందుకు అవసరమయ్యే సామగ్రి వచ్చేందుకు 6 నెలలు ఆగాలని చెప్పడంతో... రైతులే సుమారు రూ. 2లక్షలు వెచ్చించి సామగ్రి కొని ట్రాన్స్‌ఫార్మర్ అమర్చుకున్నారు. అయితే ఖర్చులు మొత్తం రైతులే భరించినా... రాయితీపై సామగ్రి అందినట్లుగా వారికి సందేశాలు వచ్చాయి. ఇదేంటని అధికారులను అడిగితే స్పందన లేదని రైతులు(Farmers problems) గోడు వెళ్లబోసుకుంటున్నారు.
రాయితీ మింగేస్తున్న సిబ్బంది
ట్రాన్స్‌ఫార్మర్ రైతులకు తక్షణ అవసరం. ఇదే అదనుగా ముడుపులు చెల్లించినవారి దరఖాస్తులనే అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం రైతులు రూ. 30వేల నుంచి 40వేల వరకూ ముట్ట చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 2019 నుంచి 2021 వరకూ జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసినట్లుగా అధికారులు(Irregularities in gadwal district power sector) చెబుతున్నారు. వీటి ప్రకారం అందాల్సిన రాయితీ సామాగ్రి విలువ కోట్లలోనే ఉంటుంది. ఇవి రైతులకు చేరకుండా అధికారులు, గుత్తేదారు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల రైతుల సొమ్ము అక్రమార్కుల పాలవుతున్న ఘటనపై... ప్రభుత్వ సునిశితంగా విచారించాలని బాధితులు కోరుతున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ కట్టాం. డీడీ కట్టిన సంవత్సరానికి మాకు ట్రాన్స్‌ఫార్మర్ వచ్చింది. దానికి అవసరమయ్యే సామగ్రి ఏం రాలేదు. స్తంభాలు, తీగలు, దిమ్మె సహా ఇతర సామాగ్రిని మెుత్తం మేమే కొనుగోలు చేస్తే విద్యుత్ అధికారులు వచ్చి ట్రాన్స్‌ఫార్మర్ అమర్చారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్ అమర్చేందుకు అవసమయ్యే సామగ్రి మాకు ఇచ్చినట్లుగా ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. దీని గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు.- పెద్ద హన్మన్న, రైతు
అయితే ఉన్నతాధికారులు మాత్రం గతంలో ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమేనని... సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేవని కొట్టి పారేస్తున్నారు.
ఇదీ చదవండి: Water in Gas Cylinder : గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు.. అవాక్కైన వినియోగదారుడు