ETV Bharat / state

100 శాతం ఓడీఎఫ్​ కల సాకారమయ్యేనా... - Hundred percent ihhl construction is possible before october 2nd

అక్టోబరు రెండు నాటికి దేశాన్ని బహిరంగా మల మూత్ర విసర్జన లేదని దేశంగా తీర్చిదిద్దుతామన్న సర్కారు కల నెరవేరేలా లేదు.  బహరంగ మల విసర్జన ఒక సాంఘిక దురాచారం.. నిత్యం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగాల్సిందేనా అంటూ ప్రజలను ఎన్ని విధాల చైతన్య పరుస్తున్నా వంద శాతం ఫలితం రావడం లేదు. కొందరు ఆశక్తి చూపకపోవడం ప్రధాన సమస్య అయితే.. స్థలాభావం వల్ల ఇంకొందరు.. డబ్బులు సరిపోవంటూ ఇంకొందరు మరుగుదొడ్లు నిర్మాణం దాటవేస్తున్నారు. ఫలితంగా వందశాతం ఓడీఎఫ్​ చేరుకోవడానికి ఉమ్మడి మహబూబ్​నగర్​లో అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

100 శాతం ఓడీఎఫ్​ కల సాకారమయ్యేనా...
author img

By

Published : Jul 13, 2019, 3:44 AM IST

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువుకుంటే ముందుగా జులై నెలాఖరుకే వందశాతం ఓడీఎఫ్​ సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచణ క్షేత్ర స్థాయిలో నీరుగారిపోతోంది. మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే పింఛన్​ నిలిపేస్తాం.. బియ్యం ఆపేస్తాం.. కరెంటు తీసేస్తామంటూ ఎంత ఒత్తిడి తెచ్చినా లక్ష్యం సిద్ధించడం లేదు. వలసలు, పేదరికం, స్థలాభావం, మూఢనమ్మకాలు ఓడీఎఫ్​ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. నాగర్​కర్నూల్​, వనపర్తి, గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారు.

ఉన్న వారైనా వినియోగించరు

కనీసం మరుగుదొడ్డి నిర్మించుకున్నవారైనా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు. కొందరు వాటిని స్టోర్​రూముగా.. కట్టెలు దాచుకునేందుకు వాడుతున్నారు. గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లలో సుమారు 30 నుంచి 40 శాతం మంది వాటిని ఉపయోగించడం లేదు.

అసంపూర్తిగా నిర్మాణాలు

చాలాచోట్ల కాంట్రాక్టు పద్ధతిలో నిర్మాణం చేపట్టడం వల్ల వాటిని మొక్కుబడిగా నిర్మించారు. ట్యాంకులకు మరుగుదొడ్డికి కనెక్షన్​ ఇవ్వలేదు. నిధులు వెచ్చించినా పనులు కాకపోవడం వల్ల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కఠినంగా వ్యవహరించినా కదలని పనులు

కొన్ని చోట్ల అధికారులు కఠినంగా వ్యవహరించడం వల్ల అరకొరగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధలతో కలిసి ప్రజలకు నచ్చజెప్పుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలంటూ అధికారులే ధర్నాకు దిగిన సంఘటనలు ఉన్నాయి.

నాగర్​కర్నూల్​ జిల్లాలో 96 వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా కేవలం 39 వేలు మాత్రమే పూర్తయ్యాయి. 17 మండలాల్లో 50 శాతం పైగా నిర్మించాల్సి ఉంది. వనపర్తిలో 54 వేలకు గాను 46 వేలు పూర్తయ్యాయి. నారాయణ పేటలో 72 శాతం పూర్తికాగా 20 శాతం పనులు ప్రగతిలో ఉన్నాయి. ఏదేమైనా ఈ నెలాఖరుకు ఇవి పూర్తయ్యేలా లేవు.

ఇలాగైతేనే లక్ష్యం చేరుకోవచ్చు

వందశాతం లక్ష్యం సాధించాలంటే నిరుపేదలకు మరికొంత మొత్తం అందించాలని, భూమిలేని వారికి సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానితో పాటు మరుగుదొడ్డి ఉన్న ప్రతిఒక్కరు దానిని ఉపయోగించేలా కఠిన చర్యలు తెస్తేనే సర్కారు కల సాకారం అవుతుంది.

100 శాతం ఓడీఎఫ్​ కల సాకారమయ్యేనా...
ఇదీ చూడండి: అక్టోబరు 2 నాటికి 'ఓడీఎఫ్ భారత్' సాధ్యమే: నిర్మల

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.