జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ సహాయ కమిషనర్ బి.కృష్ణ, ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. అమ్మవారి హుండీ ఆదాయం రూ. 37,97,556 స్వామివారి ఆదాయం.. రూ. 7,52,946, అన్నదాన సత్రం ఆదాయం.. రూ. 60,958 కాగా.. ఆలయాల మొత్తం ఆదాయం రూ. 46,11,460 వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 55 గ్రాముల మిశ్రమ బంగారం 255 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?