జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి మృతికి పాఠశాల ప్రిన్సిపలే కారణమని మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. బాలుని శరీరంపై గాయాలున్నట్లు, చెవుల నుంచి రక్తం వచ్చిందని మృతుడి సోదరి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా హాస్టల్లో ఉండే సమస్యలపై అజయ్‌కుమార్ ఫిర్యాదు చేశాడని... అందువల్లే తన సోదరుడిని ఉద్దేశపూర్వకంగా చంపి బావిలో పడేశారని సోదరి ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలంటూ బంధువులు అంబేడ్కర్ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు గురుకుల రీజనల్ కో ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ రాణి వెల్లడించారు. మృతుని కుటుంబంలో ఓ వ్యక్తికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తమవుతున్న అనుమానాలపై శవపరీక్ష తర్వాత స్పష్టత ఇస్తామన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కోన్నారు.
ఇవీచూడండి: విశ్రాంత అధికారులూ.. మీ సేవలు కావాలి