జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో భారీ వర్షాలపై అధికారులతో కలెక్టర్ శృతి ఓజా శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న తరుణంలో అలాంటి ప్రాంతాల్లో ప్రజలు సంచరించకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వాగుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైనచోట రోడ్ల వద్ద డైవర్షన్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. రోడ్లు కోతకు గురైతే వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటల వద్ద అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఎప్పటికప్పుడు తగు సమాచారం జిల్లా కేంద్రానికి చేరవేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పురాతన ఇళ్లలో నివసించే ప్రజలు పునరావాసానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీహర్ష, సీఈఓ ముషాయిదా బేగం, డీపీఓ కృష్ణ, ఆర్డీఓ రాములు, ఎపీఆర్ మమత, ఈఈపీఆర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'