ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. జోగులంబా గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో 'ఫ్రీడం రన్' ఘనంగా జరిగింది. కలెక్టర్ శ్రుతి ఓజా, ఎస్పీ రంజన్ కుమార్తో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి.. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు.
కలెక్టర్ శ్రుతి ఓజా.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆగస్టు వరకు జరిగే ఉత్సవాల్లో.. విద్యార్థులు, క్రీడాకారులంతా పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి: ఆ స్టూడెంట్స్ సగటు వేతనం రూ.28.29 లక్షలు