జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 3,02,166 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల జలాశయం
- పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం 1,042 అడుగులు
- పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 7.721 టీఎంసీలు
ఇదీచూడండి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతోన్న వరద ప్రవాహం