జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సూచికగా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత ఈ వేడుకలో పాల్గొని.. అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ ఛైర్మన్, ఈఓ వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు మంగళ వాద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం, జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. 16వ తేదీ వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూపాన్ని భక్తులందరూ దర్శించుకొని.. తరించాలని కోరారు.
ఇదీ చూడండి: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం