జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గర్భసంచి ఆపరేషన్ వికటించి ఓ మహిళ చనిపోగా.. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గద్వాలలోని చౌదరపల్లికి చెందిన మహేశ్వరి గర్భసంచి సమస్యతో బాధపడుతోంది. వైద్యుల సూచన మేరకు.. ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆమె పరిస్థతి ఆందోళనకరంగా మారగా.. ఆమెను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పరిస్థితి విషమిండం వల్ల ఆమె అక్కడే మృతి చెందింది.
గద్వాల వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహేశ్వరి మరణించిందని ఆరోపిస్తూ.. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహేశ్వరి మృతిపై యాజమాన్యం స్పందించింది. గర్భసంచి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినా... తర్వాత మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించామన్నారు. ఆ తర్వాత ఏమైందో తమకు తెలియదని చెప్పారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..