జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఉండవెల్లిలోనున్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో టోకెన్ల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర లభిస్తున్నందున రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇది గ్రహించిన మార్కెటింగ్ అధికారులు ఇవాళ్టి నుంచి టోకెన్ పద్ధతిని తీసుకొచ్చారు. అధికారులు దళారులకు అధికంగా టోకెన్లు ఇస్తున్నారంటూ రైతులు కేంద్రం వద్ద తోసుకున్నారు. సమాచారం అందుకున్న ఉండవెల్లి పోలీసులు కొనుగోలు కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా