గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ అధికారులు, పుర కమిషనర్లతో కలెక్టర్ శ్రుతి ఓజా సమావేశం నిర్వహించారు. అలంపూర్‌లో పెండింగ్‌లో ఉన్న 5 కి.మీల పైప్‌లైన్, అయిజతోపాటు మిగిలిన ఆవాస ప్రాంతాల్లో పనులన్నీ పూర్తి కావాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు జులై 31 లోగా పనులు పూర్తవుతాయని చెప్పగా, కలెక్టర్ నెల రోజుల్లోనే పూర్తి చేయాలన్నారు. గ్రిడ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న తొమ్మిది ఓవర్‌హెడ్ ట్యాంకుల పైప్‌లైన్ అనుసంధానం ఈ నెల చివరి వరకు పూర్తి కావాలని ఆదేశించారు.
గద్వాల పురపాలికలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు అవసరమైతే ట్యాంకర్లు పెంచాలని సూచించారు. మార్కెట్‌లలో మాంసం వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని దూరంగా తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో రాములు, డీపీవో కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, భీమేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.