ఇంటర్ బోర్డు వైఫల్యాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని భాజపా నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడికి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ప్రభుత్వానికి వీహెచ్ శాపనార్థాలు