జోగులాంబ గద్వాల జిల్లాలోని దసరాపల్లి సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను భాజపా నాయకురాలు డీకే అరుణ పరిశీలించారు. నిర్మాణాలు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆమె ఆరోపించారు. తెరాస నాయకులు గద్వాల పట్టణంలో మొత్తం 2500 ఇళ్లు నిర్మిస్తామని చెప్పి... కేవలం 468 మాత్రమే నిర్మిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నందువల్లే వీటిని త్వరగా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి : కొత్త గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన