జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి ఆదివారం తండ్రి అంత్యక్రియలకు గట్టు మండలం మల్లంపల్లికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు జిల్లా నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో సోదాలు నిర్వహించారు. రూ.3.2 లక్షల నగదు, మూడు తులాల బంగారం, రెండు కడియాలు దొంగతనం అయినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం