ETV Bharat / state

liquor tenders: మద్యం లైసెన్స్‌ కోసం రెండు రాష్ట్రాలు పోటీ... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

(liquor tender in telangana)రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం పోటీ పడడం విన్నాం. కానీ మద్యం దుకాణం కోసం(liquor tender) రెండు రాష్ట్రాల వాళ్లు పోటీ పడటాన్ని మీరెప్పుడైనా విన్నారా..? అవును ఇది నిజం. తెలంగాణ రాష్ట్రం మద్యం షాపుల లైసెన్స్‌ కోసం పిలువగా ఆ రెండు దుకాణాల కోసం భారీ సంఖ్యలో పక్క రాష్ట్రం నుంచి పోటీ పడుతున్నారు. అంటే ఆ ప్రాంతంలో వైన్స్​కు ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది.

liquor tenders Competition
liquor tenders Competition
author img

By

Published : Nov 18, 2021, 2:47 PM IST

రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్‌ (liquor tender) కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సైతం పోటీపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా(gadwal district) అలంపూర్ చౌరస్తాలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం కర్నూలుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్​లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో... మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏపీతో పోల్చుకుంటే ఇక్కడ అన్ని రకాల బ్రాండ్ దొరుకుతుంది. ధరలు సైతం తక్కువగా ఉంటాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన మద్యం ప్రియులు(Alcohol lovers) భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఒక్కో దుకాణంలో రోజుకి రూ. 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే మద్యం ప్రియుల తాకిడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

liquor tenders Competition
liquor tenders Competition

ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మద్యం టెండర్ల (liquor tender) కోసం భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఈ ఒక్కరోజే 500 మంది లైసెన్సులు దక్కించుకోవడానికి దరఖాస్తు చేస్తే అందులో 350 మంది కేవలం ఈ రెండు దుకాణాల కోసమే వేశారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో ఏపీనుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లైసెన్సుల కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ (liquor tender in telangana) ఏర్పడిందని ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ సైదులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సైతం టెండర్లలో (liquor tenders Competition) పాల్గొని... మద్యం దుకాణాలను దక్కించుకునే అవకాశం ఇచ్చిందని సైదులు పేర్కొన్నారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

మా ప్రాంతంలోని షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాలోని కర్నూలుకు చెందిన వారు ఎక్కువగా టెండర్లు వేస్తున్నారు. దీంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడం మాకు కొంత ఇబ్బందిగా ఉంది. -స్థానికుడు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 36 వైన్​ షాపులకు నోటిఫికేషన్​ జారీ చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా రాయలసీమ పక్కన ఉన్న మద్యం దుకాణాలకు టెండర్లు ఎక్కువగా వేశారు. ఈ నెల 20న కలెక్టర్​ ఆధ్వర్యంలో డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తాము.- సైదులు, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌

రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సుల కోసం స్థానికేతరుల పోటీ

ఇదీ చదవంది: Constable Liquor Smuggling: పోలీసు వాహనంలో గుట్టుగా మద్యం రవాణా... కానిస్టేబుల్ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.