" ఆంధ్రప్రదేశ్లో 28.35 కోట్ల ఇళ్లు నిర్మించాలని సంకల్పించాం. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.50,944 కోట్ల నిధులు ఖర్చవుతాయి. 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 34 వేల 104 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇళ్ల పట్టాలు, నిర్మాణం కోసం ఇప్పటికే 23, 535 కోట్లు ఖర్చుచేశాం. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించక పోతే ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆ ఇళ్లు నివాసానికి పనికిరాకుండా పోతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించడం సాధ్యపడటం లేదు. పీఎంఏవై కింద అందుతున్న నిధులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. పీఎంఏవై కింద రాష్ట్రాలకు సమృద్దిగా నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులిచ్చేలా సంబంధిత శాఖను ఆదేశించాలి" - వైఎస్ జగన్, ఏపీ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా... కొత్తది ఏర్పాటు చేయాలని వినతులు