ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ - లాక్​డౌన్​ కఠినంగా అమలు

గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నామని ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. లాక్​డౌన్ ఈనెల 30 వరకు పొడిగించినందున ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కంటైన్​మెంట్ ప్రాంతాల్లో నిత్యావసరాలు వారి ఇళ్లకే పంపిస్తున్నామన్నారు.

All people have to cooperate with the lockdown at gadwal
లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ
author img

By

Published : Apr 12, 2020, 3:19 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల లాక్​డౌన్​ను పటిష్టంగా కొనసాగిస్తున్నామని ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కంటైన్​మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తున్నామని వివరించారు.

దిల్లీ మర్కజ్​కి వెళ్లి వచ్చిన వారు మొత్తం 51 మంది ఉన్నారని, వారు ఎవరితో తిరిగారనే పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్​కు అందించామన్నారు. రాష్ట్ర సరిహద్దులు కర్నూల్, రాయచూర్​ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆ నిర్వహణను జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణకు అప్పగించమన్నారు. లాక్​డౌన్ ఈనెల 30 వరకు పొడిగించడం జరిగిందని, అందుకూ ప్రజలందరూ సహకరించాలని కోరారు.

లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలి : ఎస్పీ అపూర్వ

ఇదీ చూడండి : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్​ బ్రెయిన్​డెడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.