ETV Bharat / state

ఆదాయం ఉన్నా.. అభివృద్ధి సున్నా!

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఆ దేవాలయం పరిస్థితి. పేరుకు రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం. దక్షిణకాశీగా ప్రఖ్యాతికెక్కిన పుణ్యక్షేత్రం. ఇన్నీ ప్రత్యేకతలున్నా.. కనీస సౌకర్యాలు లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రపంచస్థాయి పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నా... సమస్యలకు నిలయంగా మారుతోంది.

ఆదాయం ఉన్నా..అభివృద్ధి సున్నా!
author img

By

Published : Aug 14, 2019, 11:16 AM IST

Updated : Aug 14, 2019, 12:42 PM IST

ఆదాయం ఉన్నా..అభివృద్ధి సున్నా!

అలంపూర్.. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది. అత్యంత చారిత్రక పర్యటక కేంద్రం. అయినా ఏం లాభం... ఏ పుణ్యక్షేత్రంలోనైనా కనిపించే కనీస వసతులు ఇక్కడ కనిపించవు. తనివితీరా రోజంతా గడపాలనుకునే భక్తులకు సత్రాలే లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కనీస సౌకర్యాలు కల్పించండి:

హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. సరైన రవాణా సౌకర్యం లేక ఎక్కువ మంది రాలేకపోతున్నారు. ఒకప్పుడు కర్నూల్​ నుంచి బస్సులు నడిచేవి. రాష్ట్ర విభజన తర్వాత అలంపూర్ గద్వాల డిపో పరిధిలోకి వెళ్లింది. అక్కడి నుంచి బస్సులు లేక ప్రయాణికులు ఆలయానికి వెళ్లడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఒకవేళ వాహనాల్లో వచ్చినా సరైన పార్కింగ్ సదుపాయం లేదు.

శంకుస్థాపనకే పరిమితం:

ఆలయంలో అడుగుపెట్టాక అన్నింటికీ సర్దుకుపోవాల్సిందే. మంచినీళ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సామగ్రిని భద్రపరచుకుందామన్నా లాకర్లు లేక.. చేతిలో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. కాసేపు సేదతీరుదామన్న మండపాలు లేవు. గుళ్లోనే చెట్ల కింద ఉండాల్సిందే. ఆలయ ప్రాంగణంలో సంచరించే పందులు, మేకల ఆగడాలకు అంతే లేదు. తెలంగాణ ప్రభుత్వం కోటీ 20 లక్షలతో చేపట్టిన పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.

అందుబాటులోకి రాని వసతిగృహలు:

భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వసతి సౌకర్యం. అలంపూర్​లో ఒకరోజు విడిది చేయాలనుకుంటే వసతిగృహాలు లేవు. ఇటీవలే 3 ఎకరాల్లో 50 లక్షలతో 10 వసతి గృహలు నిర్మించినా.. ఇంకా అందుబాటులోకి రాలేదు.

దృష్టి సారించాలి:

ఆలయానికి ఏటా 3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆలయాభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠం ప్రాశస్థాన్ని గుర్తించి ఆలయంపైనా దృష్టిసారించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : మూడు రోజుల పాటు జాతీయ స్థాయి కేబుల్​ ఎక్స్పో

Last Updated : Aug 14, 2019, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.