జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం బొంకూర్ గ్రామంలో 16లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్ర నూతన భవన నిర్మాణానికి అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం భూమి పూజ చేశారు. అందరికి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుబంధంగా ఇది పని చేస్తుందని తెలిపారు. దూర ప్రాంతంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఇక్కడే పేద ప్రజలకు అన్ని మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ప్రేమ వ్యవహారం బహిర్గతం.. కలత చెందిన కత్రిన