ETV Bharat / state

ఆర్డీఎస్ నుంచి చుక్క నీటి బొట్టును వదులుకోం: సంపత్​ - తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు

ఆర్డీఎస్​ నుంచి నీటి బోట్టును వదులుకోబోమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ అక్రమ నిర్మాణాలతో.. అలంపూర్​ ప్రజల భవిష్యత్​ అంధకారంలో పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

aicc secretary sampath
ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..నీటి బొట్టును వదులుకోం: సంపత్​
author img

By

Published : Feb 21, 2021, 2:34 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌కు సమాంతరంగా కాల్వలు తవ్వుతోందని.... ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల మరోసారి అలంపూర్‌ ప్రజల భవిష్యత్‌ అంధకారంలో పడే ప్రమాదముందన్నారు.

ఏపీ సర్కారు జల చౌర్యం చేస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్​ నుంచి నీటి బోట్టు వదులుకోబోమన్న సంపత్‌... ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే తుమ్మిళ్ల మూడు రిజర్వాయర్లను పూర్తి చేయాలన్నారు. రేవంత్‌రెడ్డితో తనకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..నీటి బొట్టును వదులుకోం: సంపత్​

ఇవీచూడండి: భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.