జోగులాంబ గద్వాల శాంతినగర్‌కు చెందిన పరిమళ 15 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచింది. తమ కూతురి మృతికి భర్త శేఖర్ కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో సహా శేఖర్ ఇంటి ముందుకు ధర్నాకు దిగారు.
మూడేళ్ల క్రితం పెళ్లైన పరిమళ, శేఖర్ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని... కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి బలవంతంగా తాగించారని బంధువులు చెబుతున్నారు.
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 15 రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న పరిమళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు భర్తతోపాటు అత్తమామలు పరారీలో ఉన్నాట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే