ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఎంపిక చేశారు. ప్రసాద్ పథకం ద్వారా ఆలయాలను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం 50 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అందుకు సంబంధించి స్థలాలను గుర్తించారు.
రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ మాధవి ఎంపిక చేసిన స్థలాలను పర్యటక శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. పురావస్తు శాఖ తరుఫున నిరభ్యంతర పత్రం జారీ చేయుటకు ఎంపిక చేసిన స్థలలను పరిశీలించారు. పురావస్తు శాఖ పత్రం జారీ చేశాకే పనులు మొదలవుతాయి. ఈ పథకంతో ఆలయాల పరిసర ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకొనున్నాయి.
- ఇదీ చూడండి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'