జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ. భూపాలపల్లి జడ్పీ కార్యాలయంలో జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యవసాయ, అటవీ, పశుసంవర్ధక, మత్స, హార్టికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులందరూ సహకరించుకుంటూ ముందుకు సాగాలని కోరారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు