ETV Bharat / state

'సీఎం సార్ .. మా కుటుంబాన్ని ఆదుకోండి'

సీఎం కేసీఆర్​ తనను ఆదుకోవాలంటూ తెరాస అభిమాని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తనుకు ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని ఇలాగైతే ఆత్మహత్యే శరణ్యమని.. స్వార్థ పాలనకు బలికావాలా అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.

ఫ్లెక్సీ
ఫ్లెక్సీ
author img

By

Published : Jun 1, 2022, 7:17 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ తనను ఆదుకోవాలంటూ తెరాస అభిమాని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన యువకుడు ఎరివెల్లి మహేశ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి.. కూలీ పని చేసుకుంటూ డిగ్రీ పూర్తిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని తనవంతుగా ఉద్యమానికి ఊతమిచ్చాడు.

రాష్ట్రం ఏర్పడితే జీవితాలు మారుతాయని ఎన్నో కలలుగన్నాడు. చివరకి అతడికి నిరాశే మిగిలింది. తెరాస ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పొట్టకూటి కోసం ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఇప్పటికైనా తనను ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.

"వర్షాకాలం వస్తోంది. నా ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియదు . ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇస్తోంది. అందులోనైనా ఇల్లు వస్తుందని అనుకున్నా కానీ రాలేదు. ఎస్సీ కార్పొరేషన్​లో రుణం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాను. దళితబంధులోనైనా నా పరిస్థితిని చూసి ప్రజాప్రతినిధులు, అధికారులు పేరు నమోదు చేస్తారని ఆశపడ్డా వారు పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను. ఇప్పటికైనా నా బాధను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనే ఇలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశాను." -ఎరివెల్లి మహేశ్

ఇదీ చదవండి: హైదరాబాద్‌లోనే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 2 రోజులు మోదీ, షా ఇక్కడే

'సత్యేందర్ జైన్ దేశానికి గర్వకారణం.. పద్మ విభూషణ్ ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.