జయశంకర్ భూపాలపల్లిలోని సాయిరత్న నర్సింగ్ హోమ్‌లో ఈ నెల 11న కొత్తపల్లికి చెందిన మౌనిక పాపకు జన్మనిచ్చింది. గురువారం నాడు తల్లికి ప్లేట్లెట్లు పడిపోయాయని హన్మకొండ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలో మౌనిక మృతి చెందింది. మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు.
మృతదేహంతో ఆస్పత్రి ముందు నిరసన చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మౌనికకు డెలివరీ చేసిన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?