జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను సోమవారం సాయంత్రం అధికారులు ఎత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో తాగునీటి, తదితర అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. బ్యారేజీలోని 40,41,42,43,44 గేట్ల నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
నీటిని విడుదల చేసేముందు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంత ప్రజలను, చేపల వేటగాళ్లను అధికారులు అప్రమత్తం చేశారు. బ్యారేజీ ప్రారంభించిన తదుపరి పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత గేట్లను ఎత్తి.. మరోసారి నీటిని వదిలారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వరు, ఎస్ఈ రమణరెడ్డి, డీఈ సురేష్, జేఈ వలీ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?