ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఘాట్ల మెట్లు తాకుతూ గంగమ్మ ప్రవహిస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 6.55 మీటర్ల మేర లక్షన్నర క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.
ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదనీటిలో పేరూరు వద్ద నీటిమట్టం 11.30 మీటర్లకు చేరింది. గోదావరి వరద ప్రవాహం గంటకు 20 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి: భారీ వర్షాలతో గోదావరికి జల కళ