ETV Bharat / state

గ్రామాల్లో కలెక్టర్​ పర్యటన... సర్పంచులకు చివాట్లు

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పరిస్థితులను కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీం పరిశీలించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో పర్యటించిన కలెక్టర్​.. పనితీరు సరిగ్గాలేని సర్పంచులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

WARANGAL COLLECTOR VISTED TEKUMATLA MANDAL

author img

By

Published : Mar 13, 2020, 4:51 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీం పర్యటించారు. గ్రామాల్లోని పచ్చదనం- పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. గ్రామాల్లో అన్ని వీధులకు ఇరువైపులా శుభ్రం చేసి... 17 నుంచి మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.

చిట్యాల, శాంతినగర్ మధ్య ఉన్న లెవెల్ వంతెనను అభివృద్ధి చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. రామకృష్ణాపూర్​లో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి సర్పంచ్​ను, అధికారులను అభినందించారు. అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో అక్షరాలు పలికించారు. అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి నిర్మాణానికి డబ్బులు విడుదల చేశారు.

టేకుమట్లలో పర్యటించిన కలెక్టర్​... వీధుల్లో చెత్తాచెదారం కన్పించటంపై సర్పంచ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాపరిషత్​ ఉన్నత పాఠశాలను సందర్శించి... విద్యార్థులతో ముచ్చటించారు. పిల్లల భవిష్యత్​ గురించి కలెక్టర్​ పలు సూచనలు చేశారు.

గ్రామాల్లో కలెక్టర్​ పర్యటన... సర్పంచులకు చివాట్లు

ఇవీ చూడండి: పేదోడి ఇంటి కలను నెరవేర్చే పనిలో సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.