ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదు.. కేంద్రం స్పష్టం - కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా

Central govt clarity on kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ వెల్లడించింది. జాతీయ ప్రాజెక్టు పథకం కింద చేర్చడానికి కాళేశ్వరానికి అర్హత లేదని కేంద్రం పేర్కొంది.

Telangana News
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదు.. కేంద్రం స్పష్టం
author img

By

Published : Jul 21, 2022, 5:10 PM IST

Central govt clarity on kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, 2018లో సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలి, హై పవర్‌ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది.

జాతీయ హోదా కావాలంటే సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరి. ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ ఆమోదం కూడా ఉండాలి. ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోలేదు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి. హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం. - కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.