ETV Bharat / state

అభివృద్ధిని చూసే తెరాసకు ఓటేశారు: ఎమ్మెల్యే గండ్ర - trs winning in mlc elections

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్గొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను మెచ్చే పట్టభద్రులు తెరాసకు ఓటేశారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

trs celebrations in bhupalapally
భూపాలపల్లిలో తెరాస సంబురాలు
author img

By

Published : Mar 21, 2021, 12:40 PM IST

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విజయంపై తెరాస కార్యకర్తలు, నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబురాలు చేసుకున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి.. అనంతరం కార్యాలయం ఎదుట రహదారిపై.. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.

అభివృద్ధికి ఓటు..

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే పట్టభద్రులు తమను గెలిపించారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఓటు వేసి గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ స్థానాల గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలందరినీ ఆయన అభినందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సీఎం కేసీఆర్‌.. బడ్జెట్‌లో రూ. 500కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్​కు హరీశ్​రావు ఫోన్​.. క్షణాల్లో సమస్య పరార్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.