జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కాపురానికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేయడంతో.. ఆగ్రహానికి గురైన అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన కన్నూరి కవిత అనే మహిళ భర్త గతంలో మృతి చెందాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మహేశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని రోజులకు మహేశ్ పెద్దలు కుదిర్చిన మరో యువతిని పెళ్లి చేసుకొని ఆమెతో జీవనం సాగిస్తున్నాడు.
దాంతో తనను కాపురానికి తీసుకెళ్లాలని కవిత అతనిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహేశ్.. ఆమె ఇంటికి వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కవిత కేకలు విని చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే యత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన కవితను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కవితకు 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: