ETV Bharat / state

'తక్షణమే రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి' - తెలంగాణ గొర్రెల, మేకల పెంపకం దార్ల సంఘం ప్రెస్​మీట్​

గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడబోయిన లింగయ్య యాదవ్ ఆరోపించారు. లబ్ధిదారులు కట్టిన డీడీల సొమ్ము ఇంకా బ్యాంకుల్లోనే ఉందని పేర్కొన్నారు.

'తక్షణమే రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి'

author img

By

Published : Sep 27, 2020, 8:48 PM IST

గొర్రెల పంపిణీ కార్యక్రమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలను మోసం చేసిందని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడబోయిన లింగయ్య యాదవ్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపట్టి... రెండో విడతలో పంపిణీ చేస్తామని చెప్పి ఒక్కో లబ్ధిదారుతో రూ.31,250 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 28వేల మందితో డీడీలు తీయించారని ఆరోపించారు. గొర్రెల కోసం ప్రశ్నిస్తే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం స్పందించి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని.. మేత కోసం ఒక్కో గ్రామానికి ఐదెకరాల భూమి, 55 సంవత్సరాలు దాటిన ప్రతి గొర్రెల కాపరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎక్కడికక్కడే రహదారులు నిర్బంధం చేసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చేకూరి రజిత ఓదేలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్​: మాజీమంత్రి నాయిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.