ETV Bharat / state

భూపాలపల్లి జిల్లాలో కొవిడ్ కలకలం- ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్ - covid updates in telangana

Telangana Corona Cases Today : ఒకే కుటుంబంలో అయిదుగురికి కరోనా సోకిన​ ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన వారందరిని ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్ట్ అయిన వారికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Corona Alert in Bhupalapally
Five Members Covid Positive in One Family at Bhupalapally
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 1:56 PM IST

Updated : Dec 25, 2023, 2:16 PM IST

Telangana Corona Cases Today : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత ఏడాదిన్నర నుంచి మాస్కు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్న ప్రజలను భయపెట్టేందుకు మరోసారి వచ్చేసింది. తరచూ రూపాంతరం చెందుతూ న్యూ వేరియంట్లతో గడగడలాడిస్తోంది. తాజాగా జేఎన్1 న్యూ వేరియంట్ రూపంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. న్యూ వేరియంట్ కేసులు రాష్ట్రంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు పటిష్ఠ చర్యలు చేపట్టింది.

Corona Cases in Bhupalapally : అయితే జిల్లాల్లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జయశంకర్​ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కొవిడ్(Covid) పాజిటివ్ రావడం కలకలం రేపింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్​కు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇటీవల కరోనా సోకింది. అనంతరం ఆమె కుటుంబీకులు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో వారిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Five Members In A Family Tested Corona Positive in Bhupalpally : ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు సదరు కుటుంబ సభ్యులను వారి ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. స్థానిక ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే గత వారంలో వారితో కాంటాక్ట్ అయిన వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు.

న్యుమోనియా బాధితుల్లో కొవిడ్! - నిలోఫర్ ఆసుపత్రిలో 14 నెలల బాలుడిలో వైరస్​ నిర్ధరణ

Covid Cases in Telangana Today : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఆక్సిజన్‌ సిలిండర్లను(Oxygen Cylinders) సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాల గురించి అడిగారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్‌ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్‌ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.

సీఎం రేవంత్​కు స్వల్ప అస్వస్థత - కరోనా పరీక్ష చేయనున్న వైద్యులు

రాష్ట్రంలో కలవరపెడుతున్న కరోనా - తాజాగా 12 కేసులు నమోదు

Last Updated : Dec 25, 2023, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.