విధినిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తేవాలని ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ డాక్టర్ సంగ్రాం సింగ్ జి.పాటిల్ కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహిళా పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య ఉంటే తమని సంప్రదించాలని, పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తినపుడు వాటిని నియంత్రించే సామర్థాన్ని మహిళా పోలీసులు కలిగి ఉండాలని సూచించారు. ఏ విషయంలోనూ పురుషులకంటే మహిళలు తక్కువ కాదని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం పలు అంశాలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు, డీసీఆర్బీ, ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు, సైదా రావు, ఎస్సై నిహారిక, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'స్కామ్ 1992' వెబ్ సిరీస్కు ఆ జాబితాలో అగ్రస్థానం